ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూప కల్పన వరకూ సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు కూలీతో ఇతర చట్టబద్ధమైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.