ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ మంచి చేసినా ఎలా ఓడిపోయారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికలు ఎలా జరిగాయో.. ఎలా టాపరింగ్ జరిగిందో.. కూటమి పార్టీ ఎలా గెలిచిందో అనేది దేశమంతా కోడై కూస్తోందన్నారు. అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయని అన్నారు. తప్పు చేస్తే తనను అయినా సరే జైల్లో పెట్టి నిలదీయాలని.. అంతేకానీ వైసీపీకి ఓట్లు వేశారన్న పేదలపై కక్ష కట్టొద్దన్నారు.