ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెం బాలిక హత్య కేసులో నిందితుడు సురేశ్ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నిందితుడు ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. సురేశ్ పరారైన సమయంలో బ్లాక్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, ట్రాక్ పాయింట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు బహుమతిని జిల్లా పోలీసులు ప్రకటించారు. వివరాలు తెలిస్తే 9440796084, 9440796108, 9440904229, 7382625531 లేదా 100, 112 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. నిందితుని గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఓ ప్రకటన వెల్లడించారు.