దేవీపట్నం మండల ప్రాంతంలో గోదావరి నది వరద ప్రవాహం నిలకడగా ఉంది. రెండు రోజులు పాటు భారీగా పెరిగిన నీటిమట్టం బుధవారం నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద స్నానాల రేవు చివరి మెట్టు వరకు గోదావరి వరద నీరు ఉందని తెలిపారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు నదిలో స్నానానికి దిగకూడదని, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. భక్తులు ఎవ్వరూ స్నానాలకు వెళ్లవద్దని తెలిపారు.