తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ... మోరంపూడి ప్లైవోవర్ వంతెన నిర్మాణం కోసం మాజీ ఎంపీ మురళీమోహన్ కృషి చేశారని గుర్తుచేశారు. గత ఎంపీ మార్గాని భరత్ వంతెన నిర్మాణం కోసం కృషి చేసినట్టు అబద్ధ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ప్రచారం కోసం శిలాఫలకం ఏర్పాటు చేసుకొని ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. ఆగస్టు 15 నాటికి మోరంపూడి ప్లైవోవర్ పనులను పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకువస్తామని ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు.