కుటుంబం బాగు కోసం ఉన్న ఊరు వదిలి, విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి మంచి చేద్దామనుకున్న ఒంగోలు వ్యక్తి పరాయి ఊరులో ప్రాణాలు కోల్పో యాడు. స్థానిక అన్నవరప్పాడుకు చెందిన రాజేష్‌బాబు తాను పాఠాలు బోధించే విద్యార్థి చేతిలో బలి కావడం విషాదకరం. వివరాల్లోకెళితే.. ఒంగోలుకు చెందిన బెజవాడ రాజేష్‌బాబే అధ్యా పకుడిగా పని చేస్తున్నారు. ఈక్రమంలో కుటుం బంతో సహా ఉన్న ఊరు విడిచి విశాఖ వెళ్లారు. అక్కడ పదేళ్లు ఓ ప్రైవేటు కళాశాలలో అ ధ్యాప కుడుగా పనిచేశారు. ఆ తర్వాత అస్సోం వెళ్ళిన రాజేష్‌బాబు సొంతంగా కళాశాలను ఏర్పాటు చేశారు. ఈక్రమంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రవర్తన సరిగా లేకపోవ డంతో అక్కడి అధ్యాపకుడు మందలించారు. అంతేగాకుండా కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న రాజేష్‌బాబు విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేయ డం తోపాటు, ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. తల్లిదండ్రులను కళాశాలకు తీసుకురావాలని తెలపడమే ఆయన ప్రాణాలు పోవడానికి కా రణమైంది. అయితే సహ విద్యార్థుల ముందు తనను మందలించాడన్న కక్ష్యతో రాజేష్‌బాబు తరగతి గదిలో బోధన చేస్తున్న సమయంలో కత్తితో గుండెల్లో పొడవటంతో ప్రాణాలు విడిచారు. దీంతో భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. ఇదిలా ఉండగా ఒంగోలులోని రాజేష్ బాబు బంధువుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.