పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో గంజాయి కలకలంపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై లోకేష్ తక్షణమే స్పందించారు. సమగ్ర విచారణ జరిపి, గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. విద్యాలయాల ప్రాంగణంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఇప్పటికే తమ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని లోకేష్ తెలిపారు. పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ మంత్రి నారా లోకేష్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు.