రాజకీయాలకు అతీతంగా ఎర్రగొండపాలెం మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యలను ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు వివరించారు. ఎంపిడిఓ, తహసీల్దార్, జడ్పిటిసి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.