జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, జర్నలిస్టుల సమస్యలపై తనకు అవగాహన ఉందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జర్నలిస్టుల పలు సమస్యలపై గురువారం ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు మంత్రి పార్థసారధిని కలిశారు. జర్నలిస్టుల బీమా పాలసీ, విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ, పెన్షన్ పథకం అమలు తదితర సమస్యలపై వివరించారు.