భట్టిప్రోలు మండల పీహెచ్ పరిధిలోని ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా భట్టిప్రోలు లోని టి. ఎం. రావ్ స్కూల్ విద్యార్థులతో కలిసి గురువారం ర్యాలీ నిర్వహించారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, కాన్పుల మధ్య ఎడం, తల్లి బిడ్డల ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పాటించండి, ఆరోగ్యంగా జీవించండి, కుటుంబ సంక్షేమం, దేశ సౌభాగ్యం అని స్లొగన్స్ తో పురవీధుల్లో నినాదాలు చేస్తూ గ్రామ ప్రజలను ఆలోచించే రీతిగా ఈ ర్యాలీ జరిగింది.