బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లె గ్రామం టిడిపి నాయకులు గంగయ్య, సుబ్బయ్య, జగన్, లాజరయ్య, బ్రహ్మయ్య లు శుక్రవారం మైదుకూరు నియోజకవర్గ శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ను కలసి గ్రామం సమస్యల గురించి, 2006, 07 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇచ్చిన భూమి సబ్ డివిజన్ ఆన్లైన్ కావాల్సి ఉందని వివరించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పై సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం చేస్తామన్నారు.