గత ప్రభుత్వంలో చాలామంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. అలాంటి వారిని తొలగించి ప్రభుత్వ ఖజానాకు మంచి చేయాలని జనసేన నాయకుడు యల్లటూరు శ్రీనివాస రాజు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మీడియా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉండేలా ఉచిత ఇసుక విధానం ఎన్డీయే ప్రభుత్వంలో తీసుకరావడం హర్షణీయమని శ్రీనివాస రాజు వెల్లడించారు.