ప్రతి ఒక్క వ్యక్తి నాలుగు మొక్కలు నాటి పర్యావరణం కాలుష్యం కాకుండా అరికట్టాలని కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ మురళీమోహన్ అన్నారు. శుక్రవారం కెనరా బ్యాంక్ రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో కడప బాలికల ఐటిఐ పక్కన గల ఆఫీసు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కెనరా బ్యాంకు బ్రాంచ్ ల మేనేజర్లు, ఆర్ సెట్ డైరెక్టర్ ఆరిఫ్, ఆఫీసు సిబ్బంది, శిక్షణ పొందుతున్న టైలరింగ్, బ్యూటీ పార్లర్ సిబ్బంది పాల్గొన్నారు.