రాజాం నియోజకవర్గంలోని రహదారులు పరమ అద్వాన్నముగా ఉన్నాయి. గత వైసిపి ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా పట్టించుకోక పోవడంతో ఎక్కడపడితే అక్కడే గోతులతో ఉన్నాయి. రాజాం నుంచి పాలకొండ వెళ్లే రోడ్డు నిండా గోతులతో, వర్షం పడితేనీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరిగాయి. టిడిపి ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.