వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా గ్రామాల్లో అంటువ్యాధులుప్రభలే ప్రమాదం పొంచి ఉన్నందున తక్షణమే అన్ని గ్రామాలలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం గన్నవరం ఎండిఓ కార్యాలయంలో నియోజవర్గ స్థాయి లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని డ్రైనేజీల్లో పూడిక తీసి మురుగునీరు పారుదల అయ్యేలా చూడాలన్నారు.