గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజవర్గంలో ఉన్న వివిధ సమస్యలపై అధికారుల నుండి వివరణ అడిగి తెలుసుకున్నారు. యార్లగడ్డ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా త్రాగునీరు ప్రజారోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు.