మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని మదనపల్లె-1 టౌన్ సీఐ వల్లిబాషా హెచ్చరించారు. మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ వద్ద శుక్రవారం ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయరాదన్నారు. మద్యం తాగి, హెల్మెట్ లేకుండా బైకులు నడపటం నేరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. కొత్త చట్టాలపై అవగాహన కలిగి పోలీసులకు సహకరించాలని కోరారు.