మాజీ సీఎం వైయస్ జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కూడా కేసు నమోదైంది. ప్రస్తుత ఉండి నియోజకవర్గ రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. కేసులో ఏ3గా వైయస్ జగన్ పేరును పోలీసులు నమోదు చేశారు. ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయ్‌పాల్, ఏ5గా డాక్టర్ ప్రభావతి పేరును పోలీసులు చేర్చారు. మే 14న జరిగిన ఘటనపై.. నిన్న సాయంత్రం ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేశారు. గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసుకు సంబంధించి రఘురామ మళ్లీ ఫిర్యాదు చేయడం.. ఆపై కేసు నమోదు చేయించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలు మరలా వేడెక్కనున్నాయి.