చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడం కోసం తమ ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తే, వారికి తాము ఇప్పుడు రూ.20 వేలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పథకాం ఊసే ఎత్తడం లేదని శ్రీ పేర్ని నాని గుర్తు చేశారు. అందుకే బాబు ప్రకటించినవన్నీ ఒట్టివే అని తేల్చి చెప్పారు. అదే జగన్‌గారు ఇప్పుడు సీఎంగా ఉండి ఉంటే.. ఇప్పటికే అమ్మ ఒడి, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు యథావిథిగా అమలు అయి ఉండేవని చెప్పారు. చంద్రబాబు అబద్ధాల మాటలు నమ్మిన రాష్ట్ర ప్రజల పరిస్థితి.. ‘మబ్బుల్లో నీరు చూసి ముంత వలకబోసుకున్నట్లుగా మారిందని’ శ్రీ పేర్ని నాని అన్నారు.