తాము ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నామంటూ.. ప్రభుత్వం అట్టహాసంగా కార్యక్రమం మొదలు పెట్టిందన్న శ్రీ పేర్ని నాని, పేరుకే అది ఉచితం అని.. వాస్తవానికి అది బాదుడే బాదుడని ఆయన వెల్లడించారు. ఉచిత ఇసుక అంటే.. నదికి వెళ్లి ఎవరు కావాలంటే వాళ్లు ఉచితంగా తీసుకెళ్లాలని అర్థం అన్నారు. కానీ, సీనరేజ్, రవాణా ఛార్జీల పేరుతో ఇసుక సరఫరాలో ముక్కు పిండి వసూలు చేస్తున్నారని శ్రీ నాని ఆక్షేపించారు. టన్ను ఇసుక ధర రూ.290 నుంచి రూ.1330 వరకు నిర్ధారించినట్లు, స్వయంగా గనుల శాఖ మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. అందుకే.. ‘నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. ఫ్రీ శాండ్‌లో ఉచితం ఉండదు’.. అని నాని వ్యాఖ్యానించారు.