ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్లు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. మచిలీపట్నంలో అత్యధిక మెజారిటీతో నిన్ను, నీ కుమారుడిని ఓడించారు. ప్రజలు ఛీ కొట్టిన వీళ్లు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ‘‘పేర్ని నాని నీ కపట మాటలు మానుకుని బుద్ధి తెచ్చుకో. గుడివాడ అమర్నాథ్ సాక్షి పత్రికలో వచ్చినవే చెబుతాడు’’ అని విమర్శించారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో మార్పు తెచ్చిన మనిషి చంద్రబాబు అని కొనియాడారు. అధికారులతో సమీక్ష చేసి, శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారన్నారు. జగన్ ఐదేళ్లల్లో ఎప్పుడు అయినా అధికారులతో ఇలా మాట్లాడారా అని ప్రశ్నించారు. కమీషన్లు, కాంట్రాక్టులలో మామూళ్ల కోసం జగన్ మీటింగ్లు పెట్టారన్నారు. వైసీపీ నాయకుల్లారా సిగ్గు తెచ్చుకోండి... లేదంటే జనం తమిమి కొడతారని బుద్దా వెంకన్న హెచ్చరించారు.