అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుక కోసం ముంబై వచ్చిన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు కలిశారు. టోనీ బ్లెయిర్‌తో పలు కీలక విషయాలపై చర్చించారు. పరిపాలన, విద్య, ఆరోగ్యం, రాజకీయ రంగాల్లో ఏఐ సాంకేతికత వినియోగం, తదితర అంశాలపై చర్చించారు. వివిధ రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా ఆదాయ సృష్టిపై అవకాశాల గురించి ఆరా తీశారు.