D-Mart పేరిట రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను వెలువరించింది. తొలి త్రైమాసికంలో రూ.773.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది లాభం రూ.659 కోట్లతో పోలిస్తే 17.5 శాతం వృద్ధి నమోదైందని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇదే త్రైమాసికంలో D-Mart కొత్తగా మరో ఆరు స్టోర్లను తెరిచింది.