గుడికి వెళ్లడం అనేది మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాన్ని సందర్శించుకోవడం వలన శాస్త్రీయమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అసలు గుడి ఎలా ఏర్పడింది..?దేవాలయాలకు ఎందుకు వెళ్లాలి…? అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.భారత దేశంలో వేలలో దేవాలయాలు ఉన్నాయి.అందులో కొన్ని దేవాలయాలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.అయితే భూమిలో మహర్దమైన ఆకర్షించబడిన ఆసక్తి తరంగాలు ఎక్కడ ప్రశ్నిస్తూ ఉంటాయో అక్కడే ఆలయాన్ని నిర్మించాలి. ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలాంటి ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ ఉండే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉంటాయి. అందుకే అలాంటి గుడిలో అడుగుపెట్టగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవాలయ గర్భగృహంలో ఉకృష్టమైన ఆకర్షణ తరంగాలు క్రేందికృతమైనచోట మూలవిరాటం నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన రాగి రేకును నిక్షిప్తం చేసి ఉంచుతారు.
రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువలన రోజు గుడికి వెళ్లి మూలవిరాట ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షణ చేసే అలవాటుు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడప్పుడు వెళ్లే వారికి ఆ శక్తి సోకిన కూడా గమనించే తేడా తెలియదు. కానీ నిత్యం గుడికి వెళ్లే వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇకపోతే గర్భగుడి మూడు వైపులా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎందుకంటే గర్భాలయందు ముఖద్వారాల దగ్గర పాజిటివ్ ఎనర్జీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోతగినది. దేవుడికి సమర్పించే పుష్పాలు ,కర్పూర, హారతి ,అగరత్తులు ,గంధం, పసుపు ,కుంకాల నుంచే వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వలన శక్తి మనకు విడుదలవుతుంది.
అలాగే తీర్థంలో పచ్చ కర్పూరం, యాలకులు కలుపుతూ ఉంటారు అలాగే తులసి పత్రాలు,లవంగాలు కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి. గుడికి వెళ్లేవారు తీర్థం సేవించిన వారికి ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు ఆయుఆరోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. భక్తులు గుడికి వెళ్లి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. కర్పూర హారతులు వెలిగిస్తారు గంటలు మోగుతాయి తీర్థప్రసాదాలు ఇస్తారు. కాబట్టి ఆలయానికి వెళ్లడం అనేది కాలక్షేపం కోసం కాదు.ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.