రేవూరి శంకరయ్య అధ్యక్షతన ఆదివారం బికేఎంయు రైల్వే కోడూరు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పండుగోల మణి, తోపు కృష్ణప్ప మాట్లాడుతూ దళిత, గిరిజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే సామెత లాగా మారాయని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరగకుండా సమగ్ర చట్టం తీసుకురావాలని, వ్యవసాయానికి అనుసంధానం చేసి ఉపాధి కల్పించాలని వారు అన్నారు