పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్న మాఫియాను నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాజాం ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదివారం అన్నారు. ఎక్కడైనా రేషన్ బియ్యం రవాణా చేస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమార్కులు అడ్డదారుల్లో విదేశాలకు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ రూ. 15కు కొని, విదేశాల్లో రూ. 100కు అమ్ముతున్నారని అన్నారు.