రాయదుర్గం: కుర్నిశెట్టి కళ్యాణ మండపంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సమావేశం నిర్వహించారు. జేఏసీ ఛైర్మన్ కెంచె లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదివారం హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే సమావేశాన్ని ప్రారంభించారు. వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి యూనియన్ నాయకులు తీసుకెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.