ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పకుండా నెరవేరుస్తారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కంబదూరులో ఆదివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ నేతల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనంతపురం జిల్లాను అభివృద్ధి చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.