విజయనగరం జిల్లా పరిధిలోని మార్కొండపుట్టి నిర్వాసిత గ్రామంలో అరటి తోటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. మరికొద్ది రోజుల్లో పంట చేతికందుతుందన్న సమయంలో ఇలా జరగడంతో రైతులు లబోదిబోమంటు న్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ రెవెన్యూ అధికారి ధనుంజయరావు ఆదివారం ఉదయం ఆ ప్రాం తాన్ని పరిశీలించారు. సుమారు 6 ఎకరాల అరటి పంట ను ఏనుగులు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. పంట నష్టం వివరాలను తహసీల్దార్ కార్యాలయం అధికారులకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. ఏనుగుల సంచారం లో గ్రామస్థులు పంట పొలాలకు వెళ్లేందుకు భయప డుతున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.