కర్లపాలెం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం మేరకు, సోమవారం కర్లపాలెం మండలం బోలాయపాలెం గ్రామ సర్పంచ్ లక్ష్మీ బావ నారాయణ వెంటనే జేసీబీ ద్వారా నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తున్న సర్పంచ్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.