జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో జింబాబ్వేపై టీమిండియా గెలిచింది. జింబాబ్వేతో 5టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధించింది. అలాగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. 5వ టీ20లో జింబాబ్వే టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆదేశించింది. పవర్‌ప్లే వరకు కెప్టెన్ సికందర్ రజా నిర్ణయం సరైనదని నిరూపితమైంది. పవర్‌ప్లేలో భారత్ కెప్టెన్ శుభ్‌మన్, ఓపెనర్ యశస్వి, అభిషేక్ శర్మల వికెట్లను కోల్పోయింది. అప్పటికి స్కోరు బోర్డ్‌లో 46 పరుగులు మాత్రమే చేసారు. దీని తర్వాత సంజూ శాంసన్ అర్ధశతకం సాధించి, రియాన్ పరాగ్‌తో కలిసి 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శివమ్ దూబే డెత్ ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లు బాది జట్టు స్కోరును 167 పరుగులకు చేర్చాడు." జింబాబ్వే బౌలింగ్ లో బ్లెస్సింగ్ ముసర్బాని-2 తీయగా, సికందర్ రాజా, రిచర్డ్ నగరవా, బ్రాండోన్ మవుతా తలో వికెట్ సాధించారు....
168 పరుగుల ఛేదనలో జింబాబ్వేను ముఖేష్ కుమార్, శివమ్ దూబే ఇబ్బంది పెట్టారు. ముఖేష్ పవర్‌ప్లేలో 2 వికెట్లు, 19వ ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. మిడిల్ ఓవర్లలో శివమ్ దూబే తన అద్భుతమైన బౌలింగ్‌తో 2 వికెట్లు కూడా పడగొట్టాడు. జింబాబ్వే జట్టు కేవలం 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది."ఇండియా బౌలింగ్ లో ముకేశ్ కుమార్-4, శివమ్ దుబే-2 వికెట్లు తీసుకోగా వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్ పాండే తలో వికెట్స్ తీశారు.