కర్నూలు నూతన ఎస్పీగా జీ. బిందు మాధవ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన ఏఆర్ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.