ఏకాదశి అంటేనే భక్తులకు ముందుగా గుర్తు వచ్చేది తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే. చాలామందికి ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయని తెలియదు.ప్రతి మాసంలో రెండుసార్లు ఏకాదశలు వస్తాయి. ఏ ఏకాదశి ప్రత్యేకత ఆ ఏకాదశిది. పక్షానికొక ఏకాదశి చొప్పున మాసానికి రెండు ఏకాదశలు.. సంవత్సరకాలంలో 24 ఏకాదశలు ఉంటాయి. వీటిలో హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశిలను విశేషంగా పరిగణిస్తారు. అదే ఆషాడ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి, పుష్య శుద్ధ ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.ఇకపోతే ఆషాడ ఏకాదశి జూలై 17వ తేదీ తెల్లవారుజామున 3:18 గంటలకు మొదలై జూలై 18 తెల్లవారుజామున 2:42 గంటలకు సమాప్తం అవుతుంది. ఆ రోజున భక్తులు మహావిష్ణువు ప్రార్థిస్తూ ఉపవాసం చేస్తారు. ఇకపోతే ఆషాడం మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి, మహా ఏకాదశి, దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. దీనికి కారణం ఆ రోజు నుండే చాతుర్మాసం మొదలవుతుంది. ఆ రోజు నుంచి మహావిష్ణువు పాలసముద్రంలో నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకుంటాడని భక్తులు నమ్ముతారు. ఈ కాలం చాలా శుభప్రదం అయినప్పటికీ.. శుభముహూర్తాలు ఉండవు. ఇక ఏకాదశి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదన్న విశేషాలు చూస్తే..
మహా విష్ణుకు తులసిదళం అంటే ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఆ రోజు మహావిష్ణువుకు తులసీదళాలని సమర్పించడం మర్చిపోవద్దు. అది లేకపోతే ఆరాధన అసంపూర్ణంగానే పరిగణిస్తారు.
* ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు. అయితే ఉపవాసం లేనివారు తామసిక ఆహారం తినకూడదు. తామసిక ఆహారం అంటే.. సుగంధ ద్రవ్యాలు, మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్లు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు.
* ఏకాదశి రోజున వస్త్రాలు, అన్నం, నీరు, ధనం లాంటివి దానం చేయడం మంచిది. భక్తులు దీనిని చాలా పవిత్రంగా పరిగణిస్తారు.
* ఈ రోజున భక్తులు బ్రహ్మచర్యం కచ్చితంగా పాటించాలి. శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ప్రధమం.
* ఒకవేళ ఎవరైనా ఉపవాస దీక్ష లేకున్న ఆరోజు అన్నం తినకూడదు.
ఇక భక్తులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండేటప్పుడు తేలకపాటి ఆహారం తీసుకోవాలి. అంతేకాదు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా దేవుడిపై మనసుని కేంద్రీకృతం చేసేలా ఉంచుకోవాలి.