ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. పురపాలికలో ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర అవస్థలు పడ్డారని, వాటిని పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు.