ఆత్మకూరు నుంచి అరుణాచల పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కరీ మున్నీసా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా 20వ తేదీ ఉదయం 8 గంటలకు ఆత్మకూరు నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేశామన్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని తెలియజేశారు.