తాడిపత్రిలోని మెయిన్ బజార్ లో పేదలకు సౌకర్యంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిత్యావస సరకుల పంపిణీ కేంద్రాన్ని సోమవారం తహసీల్దార్ ఆంజనేయులు ప్రారంభించారు. ప్రస్తుతం బయటి మార్కెట్లో నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోయాయని, పేదలకు సౌకర్యంగా ఉండేందుకు పలు సరకులను అందుబాటులో ఉంచుతూ తక్కువ ధరతో విక్రయించేందుకు దుకాణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.