యూపీలోని షామ్లీ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్యూటీలో ఉన్న పోలీసులు స్టేషన్లోనే మద్యం తాగారు. తమ కార్యాలయాన్ని బార్లా మార్చేశారు. టేబుల్‌పై మద్యం, నీళ్ల సీసాలు, తినుబండారాలు పెట్టుకున్నారు. ఒకరికొకరు అవి అందించుకుంటూ పార్టీ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోలీసులు యూనిఫాం ధరించి ఇలా చేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.