చక్రాయపేట మండలంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రంగా గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజా కేసరి స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, పట్టు వస్త్రాలు తొడిగి, తులసి గజమాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, భక్తులను దర్శనానికి అనుమతించారు.