పెద్దపప్పూరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీపీ వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమస్యను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధులుగా మన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కవిత, తహసీల్దార్ రాజశేఖర్, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.