మొహరం పర్వదినాలలో నిర్వహించే రొట్టెల పండుగ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా బారా షహీద్ దర్గా వద్ద హిందూ, ముస్లింలు కలిసి ఈ వేడకను నిర్వహిస్తుంటారు. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఈ పండుగ కోసం తరలివస్తున్నారు. దర్గా వద్ద తమ కోరికలను కోరడమే కాకుండా, కోరిన కోరికలు నెరవేరినందుకు గాను భక్తులు రొట్టెలను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు. మరోవైపు రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దాదాపు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అలాగే రొట్టెల పండుగ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రి నారాయణ,ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా అక్కడకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఈరోజు రాత్రి గంధమహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.