శంఖవరం మండలంలోని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయంకు బుధవారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రతమండపాలు, క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. స్వామివారి వ్రతాలు 3000 జరిగాయి. ఈ మేరకు అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 35లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.