కడప వన్ టౌన్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మహిళా పోలీస్ స్టేషన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లను బుధవారం సాయంత్రం కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించి పోలీసుల యొక్క పనితీరును సమీక్షించి, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వీడియో వాల్ ను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ కు జిల్లా ఎస్పి పలు సూచనలు చేశారు.