అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో రామ్ నగర్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వస్తున్న బస్సు ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారికి ఎవరికీ గాయాలు కాలేదు. అయితే బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా నెమ్మదించడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa