భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. "ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడండి. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో గోదావరి కట్టలు బలహీనపడ్డాయి.. వాటిపై దృష్టి పెట్టాలి. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుంది. అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్‌గా పని చేయాలి" అని సీఎం సూచించారు.