శాస్త్రీయ పద్ధతిలో నీటి సంరక్షణ పనులను చేపట్టాలని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ కమిషనర్ చిత్తరంజన్ దాస్ అన్నారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జలశక్తి అభియాన్ (క్యాచ్ రైన్-2024)కు సంబంధించి ఇరిగేషన్, డ్వామా, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పి.రంజి త్‌బాషాతో కలిసి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సంరక్షణ పనులను విరివిగా చేపట్టాలని అధికారులను సూచించారు. డ్వామా ద్వారా ప్రస్తుతం జరుగుతున్న 747 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్‌తేజ, టెక్నికల్ ఆఫీసర్ (సైం టిస్ట్-సీ) బిజయ్ కేతన్ మొహం త, సీపీవో హిమప్రభాకర్ రాజు పాల్గొన్నారు.