పెద్దపప్పూరులో మొహర్రంను పురస్కరించుకొని శుక్రవారం పీర్లు జలధికి తరలాయి. ఈకార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున ప్రత్యేక ప్రార్థ నలు నిర్వహించి పీర్లస్వాములకు అగ్నిగుండ ప్రవేశం చేయించారు. సాయంత్ర పుర వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి జలధికి తరలించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని చక్కెర చదివింపులతో మొక్కులు చెల్లించారు.