ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కూన పాపారావు శుక్రవారం రాత్రి శ్రీకాకుళంలోని మెడి కవర్ ఆసుపత్రిలో హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. హఠాత్తుగా మృతి చెందారని విన్న జర్నలిస్టులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుమారుడు అమెరికా నుండి ఆదివారం సాయంత్రంకి శ్రీకాకుళం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. పాపారావు మృతదేహం ప్రస్తుతం మెడికవర్ మార్చురీలో భద్రపరిచి ఉంచారు. సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశాలు ఉన్నాయి.