ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత నేత్ర వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నేత్ర నిపుణుల సహాయకుడు బాలగంగాధర్ రాజు తెలిపారు. శనివారం నరసన్నపేట మండలం యారబాడు సచివాలయంలో నేత్ర పరీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరంలో సుమారు 22 మందికి పరీక్షలు చేశామని తెలిపారు. ఈ నెలలో మండలంలో 70 మందిని నేత్ర శస్త్ర చికిత్సకు ఎంపిక చేసామని వీరిని శంకర్ ఫౌండేషన్ నేత్రాలయానికి పంపించామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa