వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణ కోసం సహకరించాలని చిట్వేలి మండల తహసీల్దార్ జ్ఞానేశ్వరి పిలుపునిచ్చారు. శనివారం ఎంఆర్ఓ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగులుతో తయారైన వినాయక విగ్రహాలను వాడరాదని సూచించారు. చెరువుల్లో రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వేయడం వలన నీటి కాలుష్యం జరుగుతుందని తెలిపారు.