కడప జిల్లాలోని ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్ఎం గోపాల్ రెడ్డి అన్నారు. కడపలోని కార్యాలయంలో శనివారం డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రయాణికులు ఫోన్లు చేసి సమస్యలను తెలియజేశారు. ఆర్ఎం మాట్లాడుతూ డ్రైవర్లు ఆపడం లేదని, సకాలంలో బస్సులు రావడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. వాటిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.